ఎలిగేడు: కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందని ప్రభుత్వ విప్ విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం బుర్హాన్‌మియాపేట, సుల్తాన్‌పూర్, ముప్పిరితోట, రాములపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తోందన్నారు. ఏవో ఉమాపతి, ఏపీఎం గీత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు దుగ్యాల సంతోష్‌రావు, సర్పంచులు గోపు రజిత, కవ్వంపల్లి బాపయ్య, రామిడి శైలజ, సిద్ధి తిరుపతియాదవ్, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ ఆలయంలో విప్ పూజలు
పెద్దపల్లిరూరల్: సబ్బితం గ్రామంలో ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి ఆలయంలో గురువారం జరిగిన ప్రత్యేక పూజల్లో ప్రభుత్వవిప్ విజయరమణారావు పాల్గొన్నారు. బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయకమిటీ సభ్యులు ఆయనను సత్కరించారు. సర్పంచ్ సరోజనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ప్రభుత్వ విప్ విజయరమణారావు


