తాగునీటి కోసం మూడేళ్ల కాలంగా గోసపడ్డం. ఈసారి ఎండలు మండిపోతున్నయ్. నల్లాలు ఉన్నా నీళ్లు వస్తలేవని పంచాయతీ ఆఫీసోళ్లకు చెప్పినం. వాళ్లు ఏదో ఉపాయం చేసి కాలనీకి నీళ్లు వచ్చేలా చేసిండ్రు.
– లంకదాసరి లక్ష్మి,
ఎస్సీకాలనీ, చీకురాయి
సంతోషంగా ఉంది
మండే ఎండల్లో ఇంటి అవసరాలు, తాగేందుకు నీళ్లు ఎలా తెచ్చుకునేదని భయపడ్డం. కానీ పంచాయతీ వారు శ్రద్ధ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపారు. మంగళవారం నుంచి ఎస్సీ కాలనీలోని ఇంటింటికీ నల్లా నీరు చేరింది.
మాకు చాలా సంతోషంగా ఉంది.
– మధునమ్మ, చీకురాయి
ఇబ్బందులు రానివ్వం
ఎండకాలంలో తాగునీటికి ఇబ్బందులు రానివ్వం. ఎస్సీ కాలనీలో నెలకొన్న నీటిసమస్యకు డైరెక్టు పంపింగ్ ద్వారా పరిష్కారం చూపాం. దీంతో మూడేళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఊళ్లోని అన్ని వార్డులకు తాగునీటి సరఫరా మెరుగ్గా జరిగేలా చూస్తున్నాం.
– ఓదెల శ్రీనివాస్, సర్పంచ్, చీకురాయి


