వేసవి శిక్షణ శిబిరాలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

వేసవి శిక్షణ శిబిరాలకు వేళాయె

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

సద్వినియోగం చేసుకోవాలి

పెద్దపల్లి: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వివిధ ఆటల్లో మెలకువలు నేర్పించేందుకు జిల్లాలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని డీవైఎస్‌వో సురేశ్‌ తెలిపారు. శిక్షణ ఇవ్వడానికి కోచ్‌ల ఎంపిక కోసం గతనెలలో దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఎంపికై న వారు జూన్‌ ఒకటినుంచి ఏడో తేదీ వరకు ఉదయం, సాయంత్రం వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారని వివరించారు. 14ఏళ్ల వయసులోపు బాలబాలికల్లో దాగిఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి శిక్షణ శిబిరాలు చేపట్టామన్నారు.

కోచ్‌లకు గౌరవ వేతనం

ఒక్కోకోచ్‌కు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు. క్రీడల్లో మెలుకువలు, ప్రతిభ, శారీరక, మానసికంగా పటిష్టంగా ఉండేందుకు శిక్షణ దోహదపడుతుంది.

శిక్షణ ఇలా..

గ్రామీణ విద్యార్థులు ఆసక్తి కనబర్చే వాలీబాల్‌, ఖోఖో, తైక్వాండో, ఫుట్‌బాల్‌, హాకీ, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన జెడ్పీహెచ్‌ఎస్‌ క్రీడామైదానంలో శిబిరాలు ఉంటాయి. ఆసక్తిగల విద్యార్థులు http. Satgasc. telangana. gov. In వెబ్‌సైట్‌లో తమపేర్లు నమోదు చేసుకోవాలి.

క్రీడల్లో శిక్షణ ఇచ్చే కోచ్‌ల వివరాలు

ప్రాంతం గేమ్‌ కోచ్‌ సెల్‌

కమ్మర్‌ఖాన్‌పేట వాలీబాల్‌ మహేందర్‌ 90101 60020

తెలుకుంట తైక్వాండో సతీశ్‌ 9891 43163

వెన్నంపల్లి ఖోఖో దుర్గాప్రసాద్‌ 91779 64751

నిట్టూరు ఖోఖో భాస్కర్‌ 9 1779 92471

దుబ్బపల్లి వాలీబాల్‌ ఎండీ అస్లాం 82978 28559

నందిమేడారం వాలీబాల్‌ రమేశ్‌ 82473 41845

గర్రెపల్లి వాలీబాల్‌ నవీన్‌ 97033 99149

జూలపల్లి వాలీబాల్‌ రాకేశ్‌ 89787 55521

ఎక్లాస్‌పూర్‌ కబడ్డీ సతీశ్‌ 63047 69886

అంతర్గాం ఫుట్‌బాల్‌ నరేశ్‌కుమార్‌ 70137 01104

పెద్దపల్లి ఖోఖో ఎండీ షఫీ 99497 57572

సుల్తానాబాద్‌ బాక్సింగ్‌ రాకేశ్‌ 99597 22328

యైటింక్లయిన్‌కాలనీ బాక్సింగ్‌ ప్రసాద్‌ 93908 64576

సుల్తానాబాద్‌ ఖేలో ఇండియా సెంటర్‌ 79950 78488

గ్రామీణ క్రీడాకారులు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. పట్టణ ప్రాంత క్రీడాకారులు డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేయాలి. పట్టణ ప్రాంతాల నుంచి ఎంట్రీలు ఎక్కువ వస్తేనే శిక్షణ ఇస్తాం. – సురేశ్‌, డీవైఎస్‌వో

Advertisement
 
Advertisement
Advertisement