ర్యాంక్‌ డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

ర్యాంక్‌ డౌన్‌

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

అర్థమయ్యేలా ఏఐ బోధన

మంథని: విద్యార్థులకు ఏఐపై పూర్తిఅవగాహన కల్పించేలా, సులభంగా అర్థమయ్యేలా బోధించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సూచించారు. మంథని జెడ్పీహెచ్‌ఎస్‌ (బాలికలు)లో చేపట్టిన ఏఐ శిక్షణ శిబిరం, వయోవృద్ధుల డే కేర్‌ సెంట ర్‌ను బుధవారం కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులు వేసిన డ్రాయింగ్‌లను కంప్యూటర్‌లోకి మార్చి, ఏఐ సాయంతో యానిమేషన్‌గా రూపొందించిన విధానాన్ని ఆసక్తిగా వీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, త్వరలోనే రోబోటిక్స్‌ శిక్షణ ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌, టీ ఫైబర్‌ ప్రత్యేకాధికారి జేఎస్‌ రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి

మంథని/కమాన్‌పూర్‌: నాణ్యమైన ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష సూచించారు. మంథని ఏఎంసీలో కొనుగోలు కేంద్రం, కమాన్‌పూర్‌ మండలం గుండారం ఐకేపీ సెంటర్‌, ఉపాధిహామీ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. డీఆర్డీవో కాళిందిని, ఎంపీడీవో ప్రియాంక, ఏపీఎం పద్మ పాల్గొన్నారు.

పెద్దపల్లి: బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 16వ స్థానానికే పరిమితమైంది. 2023లో 9వ ర్యాంక్‌ సాధించిన జి ల్లా.. 2024లో 8వ ర్యాంక్‌ సాధించి కాస్త మెరుగుపడింది. 2025లో పదో స్థానం దక్కించుకున్నా.. ఈసారి 16వ స్థానానికి దిగజారిపోవడం విద్యావేత్తలు, తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది.

బాలికల సత్తా..

టెన్త్‌ ఫలితాల్లో బాలికలు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణత సాధించి సత్తా చాటా రు. జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల్లో జరిగిన వార్షిక పరీక్షలకు మొత్తం 7,488 మంది విద్యార్థులు(బాలురు 3,674 మంది, బాలికలు 3,814మంది) పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 7,316 మంది(బాలురు 3,566 మంది, బా లికలు 3,750మంది) ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో శారద తెలిపారు. మొత్తంగా 97.7 శాతం ఉత్తీర్ణత నమోదైందని, రాష్ట్రస్థాయిలో 16వ స్థానం దక్కిందని వెల్లడించారు. జిల్లాలో 10 కేజీబీవీలు, 7 మోడల్‌ స్కూళ్లు, ఒక సెమీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, 72 ప్రైవేట్‌ పాఠశాలలు, 98 జెడ్పీ హైస్కూళ్లు, 4 ప్రభుత్వ హైస్కూళ్లు, 6 బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలు, 3 మైనారిటీ రెసిడెన్షియల్స్‌, 6 సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలు ఉన్నట్లు డీఈవో వివరించారు. కాగా, ఓదెల మండలం పొత్కపల్లి ప్రభుత్వ ఉన్న త పాఠశాల విద్యార్థిని రాసాల మేఘన 583 మార్కులు సాధించిన జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా.. ఉడుత శ్రీవల్లి 579 మార్కులు సాధించింది.

ఫలితమివ్వని ప్రత్యేక తరగతులు

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించిన ఉపాధ్యాయులు.. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఆ తర్వా త వివిధ రకాల టెస్ట్‌లూ నిర్వహించి వారి సామర్థ్యాలు పరిశీలించారు. చి వరగా ప్రీఫైనల్‌ పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన సౌకర్యం ఉన్నా.. అప్పటివరకు గ్రామీణ విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉదయం అల్పాహారం, సాయంత్రం ప్రత్యేక తరగతుల్లోనూ స్నాక్స్‌ అందించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద, యువజన సంఘాలు ఇతోధికంగా సాయం చేశాయి. ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించారు. విద్యాశాఖ అధికారులు తరచూ పర్యవేక్షించారు. అయినా, గతేడాదికన్నా ఈసారి ఫలితాల్లో 16వ స్థానానికి పడిపోవడం గమనార్హం.

మేఘన(583)

శ్రీవల్లి (579 )

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

పెద్దపల్లిరూరల్‌: ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయని, సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కృష్ణ అన్నారు. మదర్‌ థెరిసా ఇంజినీరింగ్‌ కాలేజీలో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడా రు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేసుకుని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ అధి కారులు ‘ప్రజాపాలన’ వారోత్సవాలు జరుపుకున్నారు. ఎస్సై లక్ష్మణ్‌రావు, అధికారులు జితేందర్‌, నిర్మల, కనకరాజు తదితరులు ఉన్నారు.

త్వరలోనే రోబోటిక్స్‌ శిక్షణ ప్రారంభం

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథనిలో సూపర్‌ సమ్మర్‌ శిక్షణ శిబిరం పరిశీలన

రాష్ట్రంలో జిల్లాకు 16వ స్థానం

ఉత్తీర్ణత 97.70శాతంగా నమోదు

బాలికలదే అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో బాలురు

Advertisement
 
Advertisement
Advertisement