జిల్లాలోనే పొత్కపల్లి స్కూల్ టాప్ 41 మందికి అందరూ పాస్ 23 మందికి 500 నుంచి 550 మార్కులు 13మంది విద్యార్థులకు 550పైగానే..
ఓదెల: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో పొత్కపల్లి హైస్కూల్ జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాసాల మేఘన 583 మార్కులు, ఉడుత శ్రీవల్లి 579 మార్కులు సాధించి జిల్లా టాపర్‌లుగా నిలిచారు. సంబోజి లాస్య, బాసవేన శరణ్య, తాళ్లపల్లి లాస్యప్రియ 567 మార్కులు సాధించారు. మొత్తం 41మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణులై వందశాతం నమోదు చేశారు. ఇందులోని 23మంది 500 నుంచి 550, 13 మంది 550కిపైగా మార్కులు సాధించి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, ఉపాధ్యాయులు అమృత కిశోర్, వై. శ్రీనివాస్, భద్రయ్య, రామకృష్ణ, రఘుపతి విద్యాబోధన తీరు, విద్యార్థుల కృషి ఇందుకు కారణమైంది. మేఘన, శ్రీవల్లిని ఎంఈవో ఎర్ర రమేశ్, ఉపాధ్యాయులతోపాటు సర్పంచ్ అంబాల సారమ్మ అభినందించారు.
వ్యవసాయ కుటుంబలో పుట్టిపెరిగిన మేఘన
583 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచిన రాసాల మేఘన తల్లిదండ్రులు లావణ్య– శ్రీనివాస్. వీరికి ముగ్గురు కుమార్తెలు, మేఘన రెండోకూతురు. మూడెకరాల్లో వ్యవసాయం చేయడంతోపాటు కూలీ పనులు చేస్తూ దంపతులు తమ పిల్లలను చదివిస్తున్నారు. తల్లితండ్రుల పోత్సాహం, ఉపాధ్యాయుల బోధన తీరుతో తాను అత్యధిక మార్కులు సాధించినట్లు మేఘన తెలిపారు. కూతురు అమూల్య బీటెక్, చిన్నకూతురు అక్షర ఇదేపాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
బాసవేన శరణ్య
సంబోజి లాస్య
టి.లాస్యప్రియ
బాసరలో చదువుతా
అమ్మానాన్న పోత్సాహం, ఉపాధ్యాయుల బోధన తీరుతోపాటు పట్టుదలతో చదివిన టెన్త్‌లో 583 మార్కులు సాధించిన. బాసరలోని ట్రిపుల్ ఐటీలో ప్రవేశం తీసుకుని సివిల్స్‌కు ప్రిపేరవుతా.
– రాసాల మేఘన, జిల్లా టాపర్


