పెద్దపల్లి: తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్.కుమార్‌గౌడ్, డి.రాజు పోటీపడ్డారని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కంది శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 65 మంది గవర్నమెంట్ డాక్టర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కుమార్‌గౌడ్‌కు 43 ఓట్లు రాగా రాజుకు 22 ఓట్లు వచ్చినట్లు వివరించారు. 21 ఓట్ల మెజారిటీతో కుమార్‌గౌడ్ గెలుపొందినట్లు ఆయన ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా శిరీష, స్వప్న, లతసాయిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కేవీ సుధాకర్‌రెడ్డి, కోశాధికారిగా సీహెచ్ విజయకుమార్, సహాయ కార్యదర్శులుగా రవీందర్, మంజూష, నిషిక్రిస్టియన, జనరల్ కౌన్సిల్‌మెంబర్లుగా అనిత,లావణ్య, వాణిశ్రీ,, యూనిట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా రవివర్మ, ఫరీద్, సంజనేష్ కుమార్, పూర్ణిమ, రాజశేఖర్‌రెడ్డి, సాయిసూర్యను ఎన్నుకున్నారు. కుమార్‌గౌడ్‌ను పలువురు పూలమాలతో సన్మానించారు. డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, డాక్టర్ వాసుదేవరెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.


