సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

● వారంలోగా స్పందించాలి ● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌

గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యలు వారంలోగా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్‌ హెచ్చరించారు. స్థానిక భాస్కర్‌రావుభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సింగరేణి కాలరీస్‌వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను సింగరేణిలో అమలు చేయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. యాజమాన్యాల దయాదాక్షిణ్యాలతో పనిచేసేలా లేబర్‌ కోడ్‌లు ఉన్నాయన్నారు. మే డే సందర్భంగా వీటి రద్దు కోసం ప్రతిన బూనాలని కోరారు. నాయకులు మడ్డి ఎల్లాగౌడ్‌, గోసిక మోహన్‌, ఎంఏ గౌస్‌, బిట్టి వెంకటేశ్వర్లు, తొడుపునూరి రమేశ్‌కుమార్‌, పడాల కనకరాజు, బూడిద మల్లేశ్‌, చెప్యాల మహేందర్‌రావు, మీసాల మల్లయ్య, కోడూరి మునీందర్‌, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement