‘మోడల్‌’.. వందశాతం | - | Sakshi
Sakshi News home page

‘మోడల్‌’.. వందశాతం

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

రామగుండం: లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు వందశాతం ఫలితాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు పంబాల సదానందం యాదవ్‌, మాధవి తెలిపారు. మోడల్‌ స్కూల్‌లో వంద మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. తాని జశ్వంత్‌ 577, బి.మనోరశ్మిత 576, ఉదురుకోట వైష్ణవి 573 మార్కులు సాధించారు. అదేవిధంగా రామగుండం గురుకుల విద్యాలయంలో 77 మంది పరీక్షకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. నీలం సిరి 564, మరో 38 మంది విద్యార్థులకు 500కుపైగా మార్కులు వచ్చాయి.

తాని జశ్వంత్‌ (577)

మనోరశ్మిత (576)

ఉదురుకోట వైష్ణవి (573)

Advertisement
 
Advertisement
Advertisement