కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు | - | Sakshi
Sakshi News home page

కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదుగుతారు

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

● రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

గోదావరిఖని: కష్టపడి చదివితే ఉన్నస్థానానికి ఎద గవచ్చని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూ ర్‌ అన్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అధిక మార్కులు సాధించిన పలు పాఠశాలల విద్యార్థుల ను బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అభినందించారు. మంచి మార్కులు సాధించిన ప్ర తీవిద్యార్థి భవిష్యత్‌లో ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మరింత పట్టుదలతో ప్రయత్నించి విజయాన్ని సాధించాలని ప్రోత్సహించారు. నగ ర మేయర్‌ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి ఠాకూర్‌ను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కా ర్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించడం, 11శాతం పీఆర్సీ ప్రకటించడం వంటి కీలక నిర్ణయాలతో ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాజ్‌ఠాకూర్‌ అన్నారు.

సఖి సెంటర్‌ ఉద్యోగుల తొలగింపు

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న నలుగురిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు డీడబ్ల్యూవో వే ణుగోపాల్‌రావు తెలిపారు. బాధితులపక్షాన ఉండాల్సిన ఉద్యోగులు రీల్స్‌ చేయడమే కాకుండా స్టేటస్‌లు పెట్టుకొని ప్రచారం చేయడం, ఉద్యోగులపై వ్యక్తిగత దూషణలు చేయడంతో అధికారులు మందలించి పలుమార్లు వివరణ తీసుకున్నారని గుర్తుచేశారు. అయినా, పద్ధతి మార్చుకోకపోవడంతో సఖి సెంటర్‌ సీఏ స్వప్న, లీగల్‌ కౌన్సెలర్‌ సుమతి, వర్కర్‌ స్వప్న, సౌజన్యను విధుల నుంచి తొలగించాలని వారధి ఇన్‌చార్జి జగపతిి సిఫారసు చేశారు. కలెక్టర్‌ ఆదేశం మేరకు నలుగురిని విధుల నుంచి తొలగించినట్లు వివరించారు.

ఇన్‌చార్జిగా ఉమారాణి

సఖి సెంటర్‌ ఇన్‌చార్జిగా ఉమారాణిని నియమించారు. ఈమేరకు జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.

విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు

పాలకుర్తి: బసంత్‌నగర్‌ సమీపంలోని బుగ్గ క్రాస్‌రోడ్డు వద్ద ఇటీవల నిర్మించిన దారి మైసమ్మ ఆలయంలో బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదపండితుడు వోజ్జల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. అంతర్గాం, బసంత్‌నగర్‌, పెద్దపల్లి పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

స్టాంపు వెండర్ల లైసెన్సులు రద్దు

కరీంనగర్‌క్రైం: జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయ పరిధి లో ఇద్దరు స్టాంపు వెండర్ల లైసెన్సులను రిజిస్ట్రార్‌ ప్రవీణ్‌కుమార్‌ రద్దు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఎండీ.రియాజుద్దీన్‌, సుల్తానాబాద్‌కు చెందిన గుజ్జ అశోక్‌రావు స్టాంపు వెండర్‌ లైసెన్సులు కలిగి ఉండగా, వీరు విక్రయించిన స్టాంపు పేపర్లలో అవకతవకలు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు వచ్చాయి. విచారణ జరిపిన అధికారులు ఇద్దరు స్టాంపు వెండ ర్ల లైసెన్సులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement