కాల్వశ్రీరాంపూర్: మండల కేంద్రానికి చెందిన పిల్లలమర్రి సాయిశివాణి(మల్యాల మోడల్ స్కూల్) టెన్త్‌లో 571 మార్కులు సాధించి మండల్ టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వారసంతలో ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, మసాలా దినుసులు విక్రయిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు పట్టులతో చదివింది. ఇదే గ్రామానికి చెందిన ఐలి జ్ఞాపిక(మల్యాల మోడల్ స్కూల్) 562 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నందిని – మహేందర్‌ది వ్యవసాయ కుటుంబం. ఐఏఎస్ లక్ష్యంగా ఉన్నత చదువులకు వెళ్తామని ఇద్దరు విద్యార్థినులు తెలిపారు.
అమ్మానాన్నల ప్రోత్సాహం
జ్యోతినగర్: నాన్న రమేశ్ కూలీ పనులు చేస్తున్నాడు. అమ్మ రేణుక ఇల్లాలు. మమ్మల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు. పదో తరగతిలో 524 మార్కులు సాధించా. మా చెల్లి వర్షిత కూడా 412 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. మా అక్కయ్యలు ఇద్దరూ డిగ్రీ చేస్తున్నారు. మాతంగికాలనీలో నివాసం ఉంటున్నాం. మా ఇంట్లో నలుగురం అక్కాచెల్లెలం, ఒక తమ్ముడు ఉన్నాడు. – హర్షిత, జెడ్పీ హైస్కూల్, రామగుండం
ఆనందంగా ఉంది
ఎన్టీపీసీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న. ఆటోనడుపుతూ కుటుంబాన్ని పోసిస్తున్నా. మా పాప ఎండీ ఫరా ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూ ల్‌లో పదో తరగతి చదివి 535 మార్కు లు సాధించడం ఆనందంగా ఉంది. మా పాపను ఉన్నత చదువులు చదివిస్తాం.
– దావూద్ ఆలీ–నాజిమా


