కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

పెద్దపల్లిరూరల్‌: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మ ద్దతు ధరకే విక్రయించాలని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు అన్నారు. బ్రాహ్మణపల్లి, రాగినేడు, కుర్మపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, రంగాపూర్‌, గౌరెడ్డిపేట, ముత్తారం, హన్మంతునిపేట, చీకురాయిలో మంగళవారం ధాన్యం కొనుగోళ్లను ఆ యన ప్రారంభించి మాట్లాడారు. పెద్దపల్లి మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ కూరమల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, సర్పంచులు ఆరె సంతోష్‌, సుజాత, రో జారాణి, అంజయ్య, కుమార్‌, లక్ష్మి, బొక్కల రేఖ, గంట రమేశ్‌, శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ గుజ్జుల కుమార్‌, కొమ్ము సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్‌ గంట రమేశ్‌తో కలిసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు.

అన్నదాతకు ప్రభుత్వం అండ

జూలపల్లి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా అన్నిగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని విప్‌ విజయరమణారావు అన్నారు. వడ్కాపూర్‌, వెంకట్రావుపల్లె, కాచాపూర్‌, కీచులాటపల్లె, కుమ్మరికుంట, బాలరాజుపల్లెలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మాట్లాడారు. నాయకులు, అధికారులు పుల్లూరి ప్రశాంతి, వేణుగోపాలరావు, పెంట కావేరి, మచ్చ అరుణ, మెండే తిరుపతి, కుంటూరి అంజమ్మ, ప్రభుదాస్‌, కొమ్మ పోచాలు, నర్సింహ యాద్‌, అలువాల తిరుపతి, రవీందర్‌రెడ్డి, సురేశ్‌ పాల్గొన్నారు.

కోతలు లేకుండా కొనుగోళ్లు

సుల్తానాబాద్‌రూరల్‌: గత ప్రభుత్వాలు కోతల పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేయగా తమ ప్రభుత్వం గింజ కోతలేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోందని విప్‌ విజయరమణారావు అన్నారు. కాట్నపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఓగుల పూజ, సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి వెంకటేశ్వర్లు, సీఈవో సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement
 
Advertisement
Advertisement