6న మెగా జాబ్‌డ్రైవ్
పెద్దపల్లి: బాలల సంరక్షణ అందరి బాధ్యతని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక –99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణపై మంగళవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మిషన్ వాత్సల్య్, అంగన్‌వాడీ సేవలు, ప్రీ–ప్రైమరీ విద్య ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. అనంతరం బాల్యవివాహాల రహిత గ్రా మంగా ఎంపికై న పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి సర్పంచ్‌కు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, గ్రామీ ణ అభివృద్ధి అధికారి కాళిందిని, అదనపు అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు మే 6న జాబ్ మేళా నిర్వహించనున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. టెలికాం కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్, బీపీవో, సేల్స్, మార్కెటింగ్, డి జిటల్ సర్వీసెస్, ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు ఉన్నాయని, ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులని కలెక్టర్ వివరించారు. పలు కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కలెక్టర్ కోయ శ్రీహర్ష


