కోల్‌సిటీ: వీధులు విశాలంగా ఉంచుకోవాలని రా మగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కో రారు. నగరంలోని 47వ డివిజన్ మార్కండేయకాలనీలో స్థానిక కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, అధికారులతో కలిసి ఆయన మంగళవారం పర్య టించారు. మేయర్ మాట్లాడుతూ, రోడ్డు ఆక్రమించి ఇళ్ల ఎదుట గద్దెలు, మెట్లు నిర్మించడం, చెట్లకొమ్మలు, పిచ్చిచెట్లతో దారి మూసుకుపోయేలా వ్యవహరించడం ద్వారా ప్రమాదాలు జరుతున్నాయని అన్నారు. స్థానికుల విన్నపం మేరకు హనుమాన్‌గు డి వీధిలో కల్వర్ట్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మేయర్ ఆదేశాలతో జేసీబీలతో మేజర్ నాలాలో పూడిక తొలగించారు. పిచ్చిచెట్లు తొలగించి శుభ్రం చేయించారు. ఇళ్ల ఎదుట స్థలం ఆక్రమించి నిర్మించిన గద్దెలు తొలగించారు. రోడ్డుపై వేలాడుతున్న చెట్లకొమ్మలు తొలగించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వడ్లూరి రవి, ఈఈ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, డీఈఈ అఫ్తాబ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, జవాన్ సంపత్ పాల్గొన్నారు.
రామగుండం మేయర్ మహంకాళి స్వామి


