పెద్దపల్లి: ఫ్లెక్సీల చించివేత పంచాయితీ మంత్రి శ్రీధర్‌బాబు వద్దకు చేరింది. సుల్తానాబాద్ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం స్థానిక నేతలు అతిథులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో తమ ఫొటో ఉండా ల్సినచోట లేదని పేర్కొంటూ రెండు గ్రూపులుగా వి డిపోయి ఫ్లెక్సీలను చించి వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ మంత్రి శ్రీధర్ బాబుదృష్టికి తీసుకెళ్లారు. దీంతో 11 మంది మున్సిపల్ పాలకవ ర్గం మంత్రికి ఆయనపై ఫిర్యాదు చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు పా లకవర్గం కూడా సమన్వయంతో పనిచేసుకోవాలని మంత్రి సూచించారు. తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్, కౌన్సిలర్లు గాజుల రాజమల్లయ్య, ఉట్ల వరప్రదీప్, రాకేశ్, సిద్ద తిరుపతి, వేగోళం అబ్బయ్యగౌడ్, కుమార్, టీకే ప్రభాకర్, శేఖర్, అంజన్న, రవీందర్, బాకం సాయికిరణ్ పాల్గొన్నారు.


