సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్‌ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్‌ఐఆర్ పత్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కానీ ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003 జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓటరు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్‌వోలకు కొత్తగా కంటి సమస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.
సర్ అంటే


