విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

Mar 1 2026 7:39 AM | Updated on Mar 1 2026 7:39 AM

విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం..అయినా వినియోగదారులు సమస్యలతో ఇబ్బందిపడితే వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1912కు సమాచారం అందిస్తే సత్వరం సమస్యకు పరిష్కారం చూపుతామని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ గంగాధర్‌ అన్నారు. టోల్‌ఫ్రీ ద్వారా అందే ఫిర్యాదుల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ప్రతీ ట్రాన్స్‌ఫార్మర్‌పై టోల్‌ఫ్రీ నంబరు 1912 ముద్రించి ఉంటుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌, విద్యుత్‌ అంతరాయాలు, బిల్లులో తప్పొప్పులు, హెచ్చుతగ్గులు, ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌, విద్యుత్‌ మీటర్ల మార్పు, కేటగిరీ మార్పు తదితర సమస్యలపై సేవలు పొందవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement