ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం

Feb 3 2026 7:16 AM | Updated on Feb 3 2026 7:16 AM

ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం

ఉద్యమిస్తేనే సమస్యల పరిష్కారం

● బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రాణీరుద్రమదేవి

పెద్దపల్లి: ఐక్యతతో ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి రాణీరుద్రమ దేవి అన్నారు. సుల్తానాబాద్‌లో సోమవారం జరిగి న సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వ నిధులతోనే గ్రామాలు, పట్టణాలు, నగరాలు అ భివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. టికెట్లు దక్కనివారు నిరుత్సాహానికి గురికాకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. నాయకులు రాజమౌళిగౌడ్‌, మీస అర్జున్‌రావు, కర్రె సంజీవరెడ్డి, నల్లమనోహర్‌రెడ్డి, కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్‌ యాదవ్‌, మిట్టపల్లి ప్రవీణ్‌ కు మార్‌, కామని రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌, నాగరాజు, రాజన్న, రాజన్నపటేల్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement