ద్విచక్రవాహనం ధ్వంసం కేసులో నిందితుడి అరెస్ట్
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ–3)లో గురువారం సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీగార్డు ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో మేకల లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. బాధితుడు పోత రాజేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. కాగా, బొగ్గు దొంగతనా లకు పాల్పడుతున్న ముఠాలను అడ్డుకుంటున్న సింగరేణి, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ సంఘటనలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.


