నిబంధనలు పాటించాలి
పెద్దపల్లిరూరల్: వాహనదారులు రోడ్డు సేఫ్టీ ని బంధనలపై కనీస అవగాహన పెంచుకుని పా టిస్తే. ప్రమాదాల నియంత్రణ సాధ్యమేనని డీ సీపీ భూక్యా రాంరెడ్డి అన్నారు. స్థానిక మున్సి పల్ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగు లు, సిబ్బందికి ట్రాఫిక్ నిబంధనలపై సీఐ అ నిల్‌కుమార్ అవగాహన కల్పించారు. ఏసీపీ కృష్ణ, కమిషనర్ వెంకటేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి డీసీపీ సూచనలు చేశారు. డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించా రు. బైక్ నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్‌బెల్ట్ ధరించాలని ఆయన అన్నారు.
లోవోల్టేజీ సమస్య పరిష్కరిస్తాం
పెద్దపల్లి: వేసవిలో లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగాధర్ అన్నారు. సుల్తానాబాద్ యాదవ్‌నగర్‌లో శుక్రవారం 160 కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బిగించగా ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో లోవోల్టేజీ సమస్యతో వినియోగదారులకు సమస్యలు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీ ఈ రాజబ్రహ్మచారి, టెక్నికల్ డీఈ బాలయ్య, ఏడీఈ రామస్వామి, ఏఈ కిశోర్ ఉన్నారు.
కృష్ణకు అమెరికా ఆహ్వానం
రామగిరి(మంథని): ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, మంథని జేఎన్టీయూ లెక్చరర్ ఎస్‌ఎస్‌ఆర్ కృష్ణకు అమెరికా నుంచి ఫీచర్డ్ ఆర్టిస్ట్ విభాగంలో ఆహ్వానం లభించింది. ఫ్లోరిడా నగరంలో ఏటా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈసారి జరిగే వేడుకలకు మనదేశం తరఫున కృష్ణ హాజరవుతారు. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించడం గర్వంగా ఉందని కృష్ణ పేర్కొన్నారు.
వచ్చేది బీఆర్‌ఎస్ సర్కారే
గోదావరిఖని: రానున్నది కేసీఆర్ పాలనే అని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక చౌరస్తాలో సంక్రాంతి సంద ర్భంగా పతంగులు ఎగురవేశాక మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే ప్రజలు ఆనందంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనతో అభివృద్ధికి దూరమవుతున్నారని అన్నారు. నాయకులు జిమ్మిబాబు, వెంకటేశ్, తిరుపతి పాల్గొన్నారు.
19నుంచి సర్పంచులకు శిక్షణ
కమాన్‌పూర్(మంథని): జిల్లాలో 262 గ్రామ పంచాయతీలకు ఎన్నికై న సర్పంచులకు ఈనెల 19 నుంచి చట్టాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దకల్వల శివారులోని మధర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 19 నుంచి 23 వరకు కమాన్‌పూర్, పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల సర్పంచులకు రూంనంబర్ ఒకటిలో, ఓదెల, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్ మండలాల సర్పంచులకు రూంనంబర్ 2లో శిక్షణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ధర్మారం, మంథని మండలాల సర్పంచులకు రూంనంబర్ ఒకటిలో, అంతర్గాం, ఎలిగేడు, జూలపల్లి, రామగిరి, ముత్తారం మండలాల సర్పంచులకు రూంనంబర్ 2లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రిజర్వేషన్లు పెంచాలి
పెద్దపల్లి: బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచాకే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని బీ సీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆరే మహేందర్ డిమాండ్ చేశారు. సుల్తానాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల తరహాలో నే బీసీల కూడా కూడా ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించాలని కోరారు. నాయకులు దశరథం, భాస్కర్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల ఇళ్లకే ‘బంగారం’
జ్యోతినగర్(రామగుండం): మేడారం సమ్మక్క –సారలమ్మ భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవ లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ కారణాలతో మేడారం వెళ్లలేని భక్తుల ఇళ్ల వద్దకే బంగారం(బెల్లం) చేర్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందభక్తులు రూ.299 చెల్లించి www.tgsr tclogistics.co.in వెబ్‌సైట్‌లో లేదా ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుక్ చేసుకోవచ్చు.
నిబంధనలు పాటించాలి
నిబంధనలు పాటించాలి
నిబంధనలు పాటించాలి


