‘గృహజ్యోతి’ కనెక్షన్లు 1.34 లక్షలు
● రెండేళ్లలో రూ.111.55 కోట్ల లబ్ధి ● లబ్ధిదారులకు లేఖ అందిస్తున్న విద్యుత్ అధికారులు
పెద్దపల్లిరూరల్: ‘మీకు.. మీ కుటంబసభ్యులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు.. మన ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం.. విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును మీ పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరిట గృహజ్యోతి లబ్ధిదారులకు లేఖలు అందిస్తున్నారు.
జిల్లాలో 1,34,896 మంది లబ్ధిదారులు..
డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క గృహజ్యోతి పథకం లబ్ధిదారుల పేరిట వ్యక్తిగతంగా రాసిన లేఖలను విద్యుత్ అధికారులు కొద్దిరోజులుగా అందిస్తున్నా రు. గతేడాది మార్చినుంచి అమలవుతున్న ఈ పథకం ద్వారా జిల్లాలోని 1,34,896 మంది వి ద్యుత్ వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. (పెద్దపల్లి డివిజన్‌లో 70,048 మంది, మంథని డివిజన్‌లో 64,848 మంది) ఇప్పటివరకు రూ.111 కోట్ల 55 లక్షల మేర వరకు లబ్ధిపొందినట్లు అధికారుల వద్ద ఉన్న గణాంకాలను బట్టి తెలుస్తోంది.
భట్టి విక్రమార్క రాసిన లేఖ
లబ్ధిదారులకు అందిస్తున్నాం
ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలకు డిప్యూటీ సీఎం పేరిట జారీ అయిన లేఖలను అందిస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వమే బిల్లులు చెల్లిస్తోంది. ఆ మొత్తాన్ని కుటుంబీకులు తమ అవసరాలకోసం వినియోగించుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు. – గంగాథర్, ఎస్‌ఈ


