సెక్యూరిటీ గార్డుపై దొంగల దాడి
గోదావరిఖని: స్క్రాప్‌దొంగలు దాడులకు తెగిస్తున్నారు. సింగరేణి ఆర్జీ–2 ఏరియాలోని ఓసీపీ–3 పాత బేస్‌వర్క్‌షాప్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో కొందరు దొంగలు రాగా అక్కడ పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ బెదిరించి పంపించాడు. ఆ తరువాత గ్యాంగ్‌తో వచ్చిన దొంగలు.. సెక్యూరిటీ గార్డుపై కర్రలతో దాడికి దిగేందుకు ప్రయత్నించారు. సెక్యూరిటీ గార్డు పరుగెత్తడంతో నిలిపిఉన్న అతడి ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల కాలంలో సెక్యూరిటీ గార్డులపై దొంగలు దాడులు చేయడంతో రాత్రిపూట విధులు నిర్వహించే వారు భయాందోళనకు గురౌతున్నారు.
భయంలో పరుగెత్తిన సెక్యూరిటీ గార్డు
ద్విచక్రవాహనం ధ్వంసం


