ఘనంగా గోదాదేవి కల్యాణం
పెద్దపల్లిరూరల్: వివిధ గ్రామాల్లో బుధవారం గోదారంగనాయకుల స్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. మూలసాల, నిట్టూరు తదితర గ్రామాల్లో జరిగిన వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మూలసాలలో జరిగిన వేడుకల్లో సర్పంచ్ జూపాక శ్వేత దంపతులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు.
సమ్మక్కకు ‘బంగారం’ మొక్కు
జ్యోతినగర్(రామగుండం): సమ్మక్క – సారరలమ్మ భక్తులు బంగారం(బెల్లం) మొక్కులు తీర్చుకుంటున్నారు. గిరిజన దేవతల మహాజా తర సమీపిస్తుండడంతో భక్తులు పూజలు చే స్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లోని వివిధ కిరాణాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన త్రాసులో బంగారం(బెల్లం) తులాభారం చేశారు. భక్తుల రాకతో మేడిపల్లి సెంటర్ రద్దీగా మారింది.
ఘనంగా పోచమ్మ బోనాలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ముదిరాజ్‌ల ఆ ధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో పో చమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. డ ప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో గ్రామంలో తొలుత బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత పోచమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి ఇష్టమైన కల్లుశాక, గుడాలు, బెల్లంపానకం నైవేద్యంగా సమర్పించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేశ్, ఉపసర్పంచ్ గోలి సుధాకర్, మురిదిరాజ్‌లు, మహిళలు పాల్గొన్నారు.
పతంగుల సంబురం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక అబ్దుల్ కలాం స్టేడియంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో పతంగుల పండుగ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయల్లో భాగంగా చిన్నారులతో కలిసి పతంగులు ఎగురవేశారు. నాయకులు మూకిరి రాజు, అనిల్ కుమార్, దేవేందర్, అఖిల్‌గౌడ్, శ్రీనివాస్, కుమార్, పాషా, వెంకట్, లక్ష్మి, నారాయణ, నరేశ్, కోటేశ్వరరావు, సాయి, ధనుశ్, వర్షిత్, గణేశ్, ఆకాశ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా గోదాదేవి కల్యాణం
ఘనంగా గోదాదేవి కల్యాణం
ఘనంగా గోదాదేవి కల్యాణం


