అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
పెద్దపల్లి: కాంగ్రెస్ హయాంలోనే అర్హులైన పేదల కు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పెద్దపల్లి ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లోని 2,3,4,5 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్లకు బుధవరాం ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. గతంలో అ ర్ధంతరంగా ఆగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎస్సారెస్పీ క్యాంప్ ఆఫీస్ వెనకాల ప్రహరీ నిర్మాణ వివాదాన్ని ఎమ్మెల్యే పరిష్కరించారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తా నుంచి శాంతినగర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, అభివృద్ధి తదితర పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.


