చందర్‌కాకానగర్ పార్క్ శిథిలం
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పెద్దపల్లిని నగర పంచాయతీగా మార్చడంతో పట్టణ రూపురేఖలు మార్చాలనే ఆలోచనతో రూ.5లక్షలకు పైగా వెచ్చించి ఉద్యాన వనాలు ఏర్పాటు చేశారు. ఇవి ఏ నాడూ వినియోగంలోకి రాలేదు. ప్రగతినగర్‌లోని చందర్‌కాకానగర్ ప్రాంత వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పార్క్ నిరుపయోగంగా మారింది. మందుబాబులు అడ్డాగ మార్చుకున్నారు. ఆ ప్రాంతానికి ప్రధాన గేట్ అమర్చిన మున్సిపాలకులు.. గేట్‌కు తాళం వేశారు. దీంతో పార్క్ ఉన్నా లేనట్లుగానే పరిస్థితి తయారైంది. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పండుగ సమయాలు, ఇతర సెలవుదినాల్లో చిన్నారులు ఆడుకునేలా పార్క్‌లను తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


