విక్రయించినా, వినియోగించినా చర్యలు
చైనా మాంజా తయారీ, విక్రయం, వినియోగంపై డేగకన్ను వేశాం. పండుగ వేళ అన్ని దుకాణాల్లో ఆక స్మిక తనిఖీలు చేస్తున్నాం. అందరినీ అప్రమత్తం చేస్తున్నాం. చైనా మాంజా వాడితే భారీ జరిమానా విధిస్తున్నాం. ఇప్పటికే ప్రత్యేక దాడులు చేశాం. నిషేధిత మాంజా నిల్వలు స్వాధీనం చేసుకున్నాం. తల్లిదండ్రులు, యువత అప్రమత్తమై సాధారణ కాటన్ దారంతోనే గాలిపటాలు ఎగురవేయాలి. ఒకచిన్న నిర్లక్ష్యం ఒకపెద్ద విషాదం కాకుండా చైనా మాంజాకు అడ్డుకట్ట వేయాలి.
– అంబర్ కిశోర్ ఝా, సీపీ రామగుండం


