శరవేగంగా అపార్ నమోదు
మంథనిరూరల్: ‘ఒకేదేశం.. ఒకే విద్యార్థి గుర్తింపు నంబర్’ నినాదంతో రూపొందించిన అపార్ ప థకం ద్వారా ప్రతీతీ విద్యార్ధికి అకడమిక్ నంబర్ ఇ చ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేక శాశ్వత గుర్తింపు నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం అపార్ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఏడాది నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వి ద్యార్ధుల బయోడేటా కారణాలతో కొన్నిచోట్ల ఆల స్యం కాగా ఈఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాలోని 14 మండలాల్లో..
జిల్లాలోని 14 మండలాల్లో 783 పాఠశాలు ఉన్నాయి. ఇందులో 1,03,859 మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. అపార్ నమోదులో భాగంగా 1,00,376 మంది విద్యార్ధులు ఆధార్ సమర్పించగా 87,874 మంది వివరాలు పరిశీలించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన విద్యార్ధులకు ఆధార్ అప్‌డేట్ చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా..
ప్రతీవిద్యార్థికి ఒకే అకడమిక్ నంబర్ ఇచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన అపార్ నమోదు ప్రక్రియ జిల్లా లో మండలాల వారీగా కొనసాగుతూనే ఉంది.
బయోడేటా లోపాలతో ఆలస్యం..
అపార్ ప్రక్రియలో విద్యార్థుల పూర్తివివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులోముఖ్యంగా ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి. అయితే అనేక మంది విద్యార్ధుల వివరాలు సక్రమంగా లేకపోవడంతో అపార్ నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. ఇందులో పాఠశాల రిజిష్టర్‌లో ఉన్న పుట్టిన తేదీ ఆధార్‌లో ఉన్నతేదీలతో సరిపోకపోవడం, విద్యార్ధుల ఇంటి పేర్లు అసంపూర్తిగా ఉండడం, తల్లిదండ్రులు పూర్తివివరాలు అందించకపోవడమే ఆలస్యానికి కారణమని అధికారులు చెబుతున్నారు.
జీవితాంతం ఒకే నంబర్
అపార్ నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతీవిద్యార్ధికి జీవితాంతం ఉండేలా ఒకే అకడమిక్ నంబర్ కేటాయిస్తారు. దీనిద్వారా విద్యార్ధి ఉన్నత చదువులు, ఉద్యోగాల విషయంలో కొంతఊరట లభిస్తుంది. ఆన్‌లైన్‌లో సదరు విద్యార్థి నంబర్ నమోదు చేస్తే పూర్తివివరాలు అందుబాటులోకి వస్తాయి. ఇలా విద్యార్ధికి అపార్ నంబర్ ద్వారా అనే ప్రయోజనాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లా సమాచారం
ప్రాంతం స్కూళ్లు శాతం
అంతర్గాంలో 30 73.39
ధర్మారం 68 75.3
ఎలిగేడు 22 79.03
జూలపల్లి 31 79.66
కమాన్‌పూర్ 24 76.71
మంఽథని 76 75.1
ముత్తారం 35 75.26
ఓదెల 46 77.25
పాలకుర్తి 37 85.13
పెద్దపల్లి 118 76.58
రామగిరి 43 69.66
రామగుండం 121 70.75
కాల్వశ్రీరాంపూర్ 55 75.95
సుల్తానాబాద్ 77 73.42
సర్కారు బడుల్లో కొనసాగుతున్న ప్రక్రియ
విద్యార్ధుల బయోడేటా లోపంతో ఆలస్యం
ఈ విద్యాసంవత్సరంలో పూర్తయ్యేలా చర్యలు
లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ అమలు
వందశాతం పూర్తిచేస్తాం
విద్యార్ధుల ఆధార్ కార్డులో పుట్టిన తేదీని సవరణ చేసుకోవాలని తల్లిదండ్రులకు చెప్పాం. పాఠశాల రిజిష్టర్‌లో విద్యార్ధి పుట్టిన తేదీకి ఆధార్‌లో డేట్ ఆఫ్ బర్త్‌కు తేడా ఉంటోంది. ఈక్రమంలో డేట్ ఆఫ్ బర్త్ సవరణలోనే ఆలస్యం అవుతోంది. ఇప్పటివరకు మంథని మండలంలో 72 నుంచి 80శాతం అపార్ నమోదు ప్రక్రియ పూర్తిఅయింది. పుట్టిన తేదీల మార్పు చేసుకున్న వారివివరాలను నమోదు చేస్తున్నాం. త్వరలోనే వందశాతం పూర్తిచేస్తాం. – దాసరి లక్ష్మి, ఎంఈవో, మంథని
శరవేగంగా అపార్ నమోదు


