చివరి ఆయకట్టుకు సాగునీరు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: చివరి ఆకట్టుకు సాగునీరు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. కుంగిన చొప్పదండి, రెవెల్లి – పెద్దపల్లి మధ్యగల ఎస్సారెస్పీ డీ– 86 కాకతీయ కాలువకు చేపట్టిన మరమ్మతు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కాలువకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం సాగునీటిపై నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు గుజ్జుల కుమార్ తన సొంతఖర్చుతో నిర్మించిన కమాన్‌ను, టీచర్స్ కాలనీని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నాయకులు నూగిల్ల మల్లయ్య, భూషణవేన సురేశ్ గౌడ్, శ్రీమాన్, జడల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, మాదారపు ఆంజనేయ రావు, పిడుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వివిధ వార్డుల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ తెలిపారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు


