కాంగ్రెస్ సత్తా చాటాలి
మంథని: యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి రోషిణి జస్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి మిట్టపల్లి వెంకటేశ్ కోరారు. మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ విస్తృత సాయి సమీక్ష ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాని వారు సూచించారు. నియోజకవర్గ అధ్యక్షుడు చీమల సందీప్, రాష్ట్ర కార్యదర్శి బండ కిశోర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొంకూరి అవినాశ్, మంథని మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు పెంటరి రాజు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో ఇళ్లపట్టాలు పంపిణీ
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి ఓసీపీ–3 విస్తరణలో భాగంగా 1995లో భూములు కో ల్పోయిన న్యూమారేడుపా క గ్రామస్తులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు బీజేపీ నాయకుడు చొప్పరి లింగయ్య తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు నిర్వాసితులను పట్టించుకోకలేదని, దీంతో 2018లో న్యాయ వాది నాగరాజును ఆశ్రయించి 182 మంది ని ర్వాసితులు, తాను కోర్టును ఆశ్రయించామని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వివరించారు.
19న మహాప్రదర్శన
పెద్దపల్లి: విద్యుత్ డిస్కంలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం యత్నించడాన్ని నిరసిస్తూ ఈనెల 19న జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాపదర్శనను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముత్యంరావు కోరారు. సుల్తానాబాద్ పూసాలలో ఆదివారం మహాప్రదర్శన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్‌లను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైస్‌మిల్లు ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు తాండ్ర అంజయ్య, ప్రధాన కార్యదర్శి, నౌండ్ల బ్రహ్మచారి, నాయకులు బండారి స్వామి, బండారి తిరుపతి, పూసాల సంపత్, రాజమౌళి, కిరణ్, శీను, లింగన్న, పోగుల లక్ష్మయ్య, సదయ్య, రమేశ్, ప్రసాద్, అజీజ్, రవి, వసంత్, సంజీవ్, ఎల్లయ్య పాల్గొన్నారు.
వేతనాలు చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టు యాజమాన్యంతో చేసిన ఒప్పందం ప్రకారం అద్దె వాహన యజమానులు డ్రైవర్లకు వేత నాలు చెల్ల్లించాలని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు, డ్రైవర్ల సంఘం నాయకుడు భూమల్ల చందర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాహన యజమానులు మైనస్ టెండర్లు వేసి డ్రైవర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు వర్తింపజేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తక్కువ వేతనం చెల్లించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పాత డ్రైవర్లను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తే సమ్మె చేయనున్నట్లు హెచ్చరించారు. నాయకులు సాగర్, ప్రశాంత్, సతీశ్, ధనుంజయ్, నారాయణ, నరేశ్, వంశీ, మధు పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● బీజేపీ జిల్లా ఇన్‌చార్జి రాజమౌళి
పెద్దపల్లిరూరల్: జిల్లాలో త్వరలో నిర్వహించే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి నాగపురి రాజమౌళి, అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆదివారం సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు తీరుపై ప్రజలకు వివరిస్తూ మ ద్దతు కూడగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేశ్, ప్రదీప్‌కుమార్, మహేందర్, నిర్మల, నల్ల మనోహర్‌రెడ్డి, శివంగారి సతీశ్, వెంకటకృష్ణ, బెజ్జంకి దిలీప్, జీవన్‌ప్రకాశ్‌రెడ్డి, మంథెన కృష్ణ, క్రాంతిఠాకూర్, సాయికృష్ణ, జాపతి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సత్తా చాటాలి
కాంగ్రెస్ సత్తా చాటాలి


