పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 1999–2000 బ్యాచ్‌కు చెందిన పదోతరగతి విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. ఇందుకు స్థానిక ఒక ఫంక్షన్ హాల్ వేదికై ంది. చిన్ననాటి తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ పొరండ్ల మధు, పూర్వ ఉపాధ్యాయులు మల్లికార్జున్‌రెడ్డి, కల్వల నాగరాజు, రమేశ్, తిరుపతి, రాజన్న, సునీల్, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు సుకాంత్, రవి, సతీశ్, రషీద్, రాజేశ్, శ్రీలతరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు.


