అకాలం.. అన్నదాత ఆగం
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
పెద్దపల్లిరూరల్: చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న ఎస్సారెస్పీ నీరు జిల్లాకు చేరుకుంటుంది. దీనిఆధారంగా రైతులు వరి, మొక్కజొన్న వేయాలని చూస్తున్నారు. చలితీవ్రత అధికంగా ఉండడంతో కొన్నిచోట్ల నారుమడులు దెబ్బతింటున్నాయి. కూనారం వ్యవసాయ పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు మేలు రకం వంగడాలనే విత్తాలని సూచిస్తున్నారు.
ధర ఉన్నా దిగుబడి రాలే
ఈ సారి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేదు. దిగుబడి తగ్గాక ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.7,400కుపైగా పలుకుతోంది. దీంతో తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులు దిగాలు చెందుతున్నారు.
సీసీఐ ఆంక్షలతో అవస్థలు..
పత్తి విక్రయాలపై కాటన్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా(సీసీఐ) విధించిన ఆంక్షలు ఇటు రైతులు, అ టు మిల్లర్లు, అడ్తివ్యాపారులను ఇబ్బందులకు గురిచేశాయి. కపాస్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవడంపై అవగాహన లేనిరైతులు ఆందోళన చెందారు. ఎకరాకి గతంలో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం వివాదానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగడంతో కొనుగోళ్లు సాధారణంగానే సాగాయి.
ధాన్యం తేమశాతం రాక..
ధాన్యం దిగుబడి కూడా ఆశించిన మేర రాలేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమశాతం లేదని నిర్వాహకులు కొర్రీలు పెట్టారు. రైతులు రోజుల త రబడి నిరీక్షించారు. ఒక్కోటి రూ.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యం ఆరబెట్టే యంత్రాల(డయ్యర్)ను జిల్లాకు ఐదు చొప్పున కేటాయించారు. ఇవి ఇప్పటివరకు ఒక్కగింజను కూడా ఆరబెట్టలేదు. రైతులకు రోడ్లే దిక్కయ్యాయి. కొందరు రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమకాలేదు.
రైతుబీమా
వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేశారు. జిల్లాలో 94,473 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆరేళ్లలో 2,208 మంది రైతులు మరణించారు. అందులో 2,190 మంది కుటుంబాలకు బీమా సొమ్ము జమచేశారు. రైతుభరోసా ద్వారా ఈఏడాది 1,51,507 మంది రైతులకు రూ.1,61,02,63,368 అందజేశారు. పీఎం కిసాన్ సమ్మాణ్‌నిధి రైతుల సంఖ్య ఐదేళ్లక్రితం 83,419 ఉండగా.. 31 జూలై 2025 నాటికి వారి సంఖ్య 61,048కే పరిమితమైంది.
పండ్లు, కూరగాయలకు ప్రోత్సాహం
పండ్లతోటలు, కూరగాయల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ధ ర్మారం, జూలపల్లి మండలాల్లోని మామిడితోటల్లో నాణ్యమైన దిగుబడికి బంచ్‌కవర్ పద్ధతి పాటించేలా రైతులకు ఉద్యానవన అధికారులు సూచనలిస్తున్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన నరేశ్ డ్రాగన్ ప్రూట్ సాగుచేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
ఆయిల్‌పాంపై ప్రత్యేక దృష్టి..
ఆయిల్‌పాం సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. 2,500 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 500 ఎకరాల్లో పంట సాగుచేశారు. మరో 350 ఎకరాల్లో సాగుకానుంది. అంతరపంటగా చాకొలేట్ తయారీకి అవసరమయ్యే కొకొవా రకం పంట సాగును ఈఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాడ్‌బరీ అనే చాకొలేట్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే రైతులకు అవగాహన కల్పించారు.
ఈ ఏడాది వ్యవసాయ రంగంపై వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. అన్నదాతలు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేక పోయారు. గతేడాది వానాకాలంలో ధాన్యం దిగుబడి మెరుగ్గా ఉండగా.. ఈసారి పంట చేతికందే దశలో వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు ఆగం చేశాయి. జిల్లాలో వరి 2,12,000 ఎకరాలు, పత్తి 49,482 ఎకరాల్లో సాగు చేశారు.
ఆదిలోనే అన్నదాతకు అనేక కష్టాలు
పంట చేతికొచ్చే దశలో ఆగని వానలు
ధరలు పెరిగినా బాగా తగ్గిన పత్తి దిగుబడి
గతేడాది దిగుబడి ఘనం.. ఈసారి అంతంతే
నల్లరేగడి నేలలు(ఎకరాల్లో) 1,10,504
ఎర్ర నేలలు(ఎకరాల్లో) 1,79,330
ఇసుక నేలలు(ఎకరాల్లో) 5,360
రైతుల సంఖ్య 1,61,032
వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో)
జిల్లా సమాచారం
అకాలం.. అన్నదాత ఆగం
అకాలం.. అన్నదాత ఆగం
అకాలం.. అన్నదాత ఆగం
అకాలం.. అన్నదాత ఆగం
అకాలం.. అన్నదాత ఆగం
అకాలం.. అన్నదాత ఆగం


