సంప్రదించాల్సిన ఫోన్‌నంబరు : 98490 22772 సమయం : ఉదయం 11
మల్లన్నకు బోనం మొక్కులు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధి ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర
యైటింక్లయిన్‌కాలనీ: యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. షిర్కే బస్‌స్టాప్ చౌరస్తా నుంచి న్యూమారేడుపాక శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా ఒగ్గు కళాకారులు విన్యాసా లు, కళాకారులు కోలాటాలతో ఆకట్టుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారికి బోనాలతో నైవే ద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కా ర్యక్రమంలో నాయకులు గడ్డం తిరుపతి, కేశవులు, సాంబమూర్తి, మల్లేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
ఎన్టీపీసీలో ఉల్లాస్ మేళా
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌ న్‌షిప్‌లో ఆదివారం ఉల్లాస్ మేళా ఘనంగా ని ర్వ హించారు. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్విందం సిన్హా కేక్ కట్ చేసి మేళా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీలో అన్ని రాష్ట్రాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నా రు. అందరి సహకారంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉద్యోగుల అభ్యున్నతికి సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈడీ చందన్ కుమార్ సామంత, ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు.
యాసంగి సాగు వివరాలు(ఎకరాల్లో)
పప్పు దినుసులపై నిరాసక్తత
పప్పుదినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. కంది గెట్టు పంటగా మారగా, పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2022లో 691 ఎకరాల్లో కంది సాగు చేసిన రైతులు.. 2023లో 159 ఎకరాలు, 2024లో 169 ఎకరాల్లో పండించారు. ఈఏడాది 110 ఎకరాలకే పరిమితం చేశారు. వేరుశనగ నాలుగెకరాల్లోనే సాగవడం గమనార్హం.
దిగుబడిపై ప్రభావం
వాతావరణ పరిస్థితులు ఈఏడాది దిగుబడిపై ప్రభావం చూపాయి. వానాకాలం వరి పంట చేతికి అందే దశలో కురిసిన అకాల వర్షాలకు జరిగిన నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. పత్తిపై ప్రభావం చూపడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది.
– శ్రీనివాస్, డీఏవో