పల్లెదరికి అత్యవసర సేవలు
● మంత్రి శ్రీధర్‌బాబు
ముత్తారం(మంథని): గ్రామీణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మచ్చుపేటలో బుధవారం రాత్రి 108 అంబులెన్స్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక సాంకేతికత కలిగిన అంబులెన్స్‌లో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని తెలిపారు. గ్రామీణ ప్రజలకు క్షణాల్లో వైద్యసేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ దోహదపడుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుండె రాజేశం విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఎస్సీకాలనీలో తాగునీటి బోరు ప్రారం భించారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ మధూసూదన్‌రెడ్డి, వైద్యుడు అమరేందర్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్‌మోహన్‌రావు, సర్పంచ్ సిలివేరు జ్యోతి, ఉపసర్పంచ్ దొంతుల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


