మంత్రి మాటలు హాస్యాస్పదం
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని: చెక్‌డ్యాం నాణ్యతతో నిర్మించలేదని మంథని ఎమ్మెల్యే ధ్రువీకరిస్తూ విచారణకు ఆదేశించామని అంటున్నారని, మంత్రిస్థాయిలో నాణ్యత లేదని చెప్తుంటే.. అధికారులు మరోతీరు నివేదిక ఇస్తారా? అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. పరోక్షంగా అధికారులను భయపెడుతూ తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా మట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదినుంచీ చెక్‌డ్యాంలు నిర్మించడం ఇష్టంలేదని పదేపదే చెప్పిన మంథని ఎమ్మెల్యే.. అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను తన అనుచరులతో కూల్చివేయించినట్లు వ్యవహరిస్తూ ఉంటే అనుమానం వస్తోందన్నారు. చెక్‌డ్యాంను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమన్నారు. సమావేశంలో నాయకులు తరగం శంకర్‌లాల్, ఏగోళపు శంకర్‌గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, బెల్లంకొండ ప్రకాశ్‌రెడ్డి, పుప్పాల తిరుపతి, కొండ రవీందర్ పాల్గొన్నారు.


