‘భోజన’ నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు
పెద్దపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకంపై తన కార్యాలయంలో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈనెల 25వ తేదీ వరకు కట్టెలపొయ్యిపై వంటలు తయారు చేయకుండా గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయాలని, గ్యాస్‌స్టవ్ పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో 23వేల కొత్త రేషన్‌కార్డులు జారీచేశామని, అందులో వంటగ్యాస్ కనెక్షన్ లేనివారికి ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్ అందించాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాశ్ పాల్గొన్నారు.
దరఖాస్తులు ఆహ్వానం..
కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 10శాతం వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి, అర్హత గలవిద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
పాఠాలు అర్థమవుతున్నాయా?
పెద్దపల్లిరూరల్: ‘కంప్యూటర్ పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయా.. కంప్యూటర్‌పై అవగాహన ఉందా.. ఎలా నేర్చుకుంటున్నారు? అని కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థులను ప్రశ్నించారు. రంగాపూర్ ప్రాథమిక పాఠశాలలోని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ల్యాబ్‌లో శిక్షణ పొందుతున్న ‘సి’ గ్రేడ్ విద్యార్థులను సోమవారం ఆయన కలుసుకున్నా రు. వారితో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు శివమణి, సాయివరుణ్‌తేజ, శ్రేయాన్స్.. కంప్యూటర్ ఆధారిత పాఠాలను స్క్రీన్‌పై చూపుతూ కలెక్టర్‌కు వివరించారు. ప్రైమరీలో 32మంది విద్యార్థులు ఉన్నారని, వారికి పాఠాలు సులువుగా అర్థమయ్యేలా బోధిస్తున్నామని టీచర్ స్నేహ వివరించారు.
ఆదేశించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష


