బస్సు డిపో పనులు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: పంచాయతీ సమితి కార్యాలయంగా సుమారు 51ఏళ్ల క్రితం పురుడుపోసుకుని అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రారంభించిన భవనం కనుమరుగవుతోంది. అర్ధశతాబ్దపు ఆనవాళ్లు కనిపించకుండా పోతున్నాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లు నీడ, ఆహ్లాద వాతావరణం అందించేవి. వీటిని ప్రస్తుతం నరికివేస్తున్నారు. దీంతో స్థానికులు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మండే ఎండల్లో చల్లని నీడకోసం ఎంపీడీవో కార్యాలయంలోని చెట్లకిందకు వందలాది మంది చేరి సేదతీరేవారు. సెలవుదినాల్లో హాస్టల్ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సైతం ఇక్కడే విశ్రాంతి తీసుకుని కబుర్లు చెప్పుకునే వారు. ఆర్టీసీ బస్సు డిపోకు కేటాయించిన ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో పెరి గిన రావి, టేకు, వేప, కానుగ, సుబాబుల్, సపోట, అల్లనేరేడు, కొబ్బరి, నిమ్మ, చింత, అశోక తదితర 150రకాల చెట్లను తొలగించడం సోమవారం ప్రా రంభించారు. చెట్ల నరికివేతతో కొద్దిరోజుల్లో ఏళ్లనాటి భవనాలు కాలగర్భంలో కలిసి పోనున్నాయి. వాటిస్థానంలో బస్సు డిపో ఏర్పాటు కానుంది.
కాలగర్భంలో అర్ధశతాబ్దపు చెట్లు
కనుమరుగుకానున్న భవనాలు


