ప్రజావాణికి సమస్యలు ఏకరువు
పెద్దపల్లి: అర్జీల రూపంలో అందే సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామానికి చెందిన కల్లుగీతకార్మికుడు గుండ రమేశ్.. ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడడంతో శాశ్వత వైకల్యం కలిగిందని, పరిహారం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖకు అదనపు కలెక్టర్ వేణు సూచన చేశారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బి.రవికుమార్.. తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అధికారులకు దరఖాస్తు చేయగా.. వారధి సొసైటీకి రాశారు. పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంటకు చెందిన ఒంటరి మహిళ ఎం.సమ్మక్క.. ఆర్థికసాయం కోసం అర్జీ సమర్పించగా.. డీఆర్డీవోకు బదిలీ చేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన డి.శంకరయ్య.. హనుమాన్ ఆలయం వద్ద రెండు బెల్ట్‌షాపులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేయగా.. చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ శాఖను వేణు ఆదేశించారు.
అదనపు కలెక్టర్ వేణు ఆదేశాలు
ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ


