జాగ్రత్తలు తీసుకోవాలి
న్యుమోనియా వ్యాధి రాకుండా అప్పుడే పుట్టిన ప్రతీబిడ్డకు ముందస్తుగా వ్యాక్సిన్ వేయించాలి. వ్యాధి నియంత్రణకు పిల్లలు, పెద్దవారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ముఖానికి మాస్క్ అడ్డుపెట్టుకోవడం చాలామంచిది. వ్యాధిగ్రస్తులు కోలుకోవడానికి వైద్యులు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా చలికాలంలో చాలాజాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో


