
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్ ఆదేశించారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టిన చర్యలపై ఆయన సోమవారం ఆరా తీశారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో జిల్లా వైద్యాఽధికారి, ఇతర వైద్యాధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది గురించి ఆరా తీశారు. డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి మాట్లాడుతూ, వైద్యసేవలు, అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరించారు. రవీంద్రనాయక్ మాట్లాడుతూ, నిబంధనల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజు వసూలు చేయాలన్నారు. ఆస్పత్రుల్లో టారిఫ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రోగ్రాం అధికారులు రాజమౌళి, వాణిశ్రీ, సుధాకర్‌రెడ్డి, కిరణ్‌కుమార్ ఉన్నారు.
వైద్యసేవలపై ఆరా..
సుల్తానాబాద్/సుల్తానాబాద్‌రూరల్: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం, గర్రెపల్లి పీహెచ్‌సీని కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్‌వో అన్న ప్రసన్నకుమారి సందర్శించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. గర్రెపల్లి పీహెచ్‌సీ పరిధిలో నమోదైన డెంగీ కేసులు, నియంత్రణకు తీసుకున్న చర్యలపై సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి అందిస్తున్న వైద్యసేవలు భేష్‌గ్గా ఉన్నాయని కితాబిచ్చారు.
టెన్త్ టాపర్లకు ప్రోత్సాహకం
పెద్దపల్లిరూరల్: ఉన్న ఊరిపై మమకారంతో ప్ర భుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అమెరికా లో స్థిరపడ్డ సోదరులు వావిలాల రవీందర్‌రావు, వెంకటరమణారావు ఏటా ప్రోత్సాహక బహుమ తులు అందిస్తున్నారు. అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ.10వేల చొప్పున, 500కుపైగా మార్కులు సాధించిన మరో 9మందికి రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నా రు. సోమవారం కూడా నిట్టూరు జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. పంద్రాగస్టు, రిపబ్లిక్ డే సందర్భంగా క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతులు అందించడం అభినందనీయమని ఎంఈవో సురేంద్రకుమార్ అన్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం