
శిథిల భవనాలు ఖాళీ చేయండి
కోల్‌సిటీ(రామగుండం): నగరంలో శిథిలావస్థలో ఉ న్న భవనాల్లో నివాసం ఉండేవారు వెంటనే ఖాళీ చే యాలని, పరిసరాల్లో కూడా ఎవరూ సంచరించరా దని బల్దియా అధికారులు మంగళవారం హెచ్చరిక నోటీసులు జారీచేశారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో నల్లా నీటికి క్లోరిన్ పరీక్షలు చేశా రు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి గాంధీనగర్ లోని కమ్యూనిటీ టాయిలెట్స్‌లో వసతులు పరిశీలించారు. ఆవరణను పరిశుభ్రం చేయించారు. పరిసరాల పరిశుభ్రత, తడి, పొడిచెత్త వేరు చేయడం, దోమల నిర్మూలన, కుక్కకాటు బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించా రు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కిర ణ్, నాగభూషణం, మెప్మా సీవో ప్రియదర్శిని, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేట ర్ శ్రీకాంత్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, మెప్మా ఆర్పీలు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు.
రామగుండం బల్దియా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి