
కలెక్టర్‌ను నేరుగా కలవొచ్చు
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రజలు తమ సమస్యల ను నేరుగా కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి విన్నవించుకోవచ్చు. ఇందుకోసం బుధవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉంటానని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. సమస్యలు, ఇతర అంశాలపై తనతో నేరుగా చర్చించవచ్చన్నారు. సందర్శకులు, ఫిర్యాదుదారులు తమకు కేటా యించిన సమయాల్లోనే కలెక్టరేట్‌కు రావాలని ఆయన సూచించారు. మిగతా రోజుల్లో అత్యవసర పనులకోసం అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులను సంప్రదించాలని తెలిపారు.
పఠనా నైపుణ్యం పెంచాలి
ముత్తారం(మంథని): విద్యార్థుల్లో పఠన, నైపుణ్యత, సామర్థ్యం పెంచాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్ తెలిపారు. ల క్కారం జెడ్పీ కాంప్లెక్స్ పరిధిలోని మచ్చుపేట, కాజీపల్లి, శుక్రవారంపేట, మైదంబండ, హరిపురం, పోతారం, కేశనపల్లి, ధరియాపూర్ ప్రా థమిక పాఠశాలలను షేక్ ఆధ్వర్యంలోని జిల్లా రిసోర్స్ బృందం మంగళవారం ఆకస్మికంగా త నిఖీ చేసింది. ఎఫ్‌ఎల్‌ఎన్ తరగతులు పరిశీలించింది. సభ్యులు ప్రవీణ్, సంపత్‌రెడ్డి, సమద్, రవి, ప్రభాకర్‌రెడ్డి, కిరణ్, దేవేందర్‌రెడ్డి, ఎంఈవో హరిప్రసాద్, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు సు హాసిని, పద్మాదేవి, రాజేఽశ్వర్‌రావు ఉన్నారు.
నేడు, రేపు కేజీబీవీల్లో స్పాట్ అడ్మిషన్లు
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని 8 కస్తూరిబా గాంధీ బాలికల(కేజీబీవీ) కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తిగల వారు ఈనెల 30, 31వ తేదీల్లో చేపట్టే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని డీఈవో మాధవి తెలిపారు. అంతర్గాంలో 10 బైపీసీ, జూలపల్లిలో 15 బైపీ సీ, ముత్తారం (మంథని)లో 16 సీఈసీ, 19 ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఓదెలలో 18 ఎంపీసీ, 27 బైపీసీ, పాలకుర్తిలో 19 ఎంఎల్‌టీ, 19 బైపీసీ, రామగిరిలో 10 ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్ 25, కాల్వశ్రీరాంపూర్‌లో 20 సీఈసీ, 2 ఎంపీహెచ్‌డబ్ల్యూ సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
31న గురుకులాల్లో..
ధర్మారం(ధర్మపురి): జిల్లాలోని సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడీయెట్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 31న స్పాట్ అడ్మిషన్ చేపట్టామని గురుకుల విద్యాలయాల కో ఆర్డినేటర్ దేవసేన తెలిపారు. ఆస క్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఒకటిన రాష్ట్రస్థాయి గ్రాండ్ టెస్ట్
పెద్దపల్లిరూరల్: స్థానిక ప్రభుత్వడిగ్రీ కాలేజీలో ఆగస్టు ఒకటిన జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జువాలజీ సబ్జెక్టుపై రాష్ట్రస్థాయి గ్రాండ్‌టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో గూగుల్‌ఫామ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నా రు. ఆగస్టు 7న నిర్వహించే ఎమ్మెస్సీ జువాలజీ ప్రవేశ పరీక్షకు గ్రాండ్‌టెస్ట్ ఎంతోఉపకరిస్తుందన్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేసిన హెచ్‌వోడీ తిరుపతిని ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సయ్య, వైస్ ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్, అకడమిక్ కో ఆర్డినేటర్ పురుషోత్తం, మురళి అభినందించారు.
31న గొర్రెలకాపరుల సదస్సు
పెద్దపల్లిరూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొ ర్రెల పెంపకందారుల సదస్సు ఈనెల 31న క రీంనగర్‌లోని ఇందిరా ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్నామని సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మారం తిరుపతితోపాటు ప్రతినిధి చిలారపు పర్వతాలు తెలిపారు. ఈ సందర్భంగా చేపట్టిన 18వ వార్షికోత్సవ సభకు హాజరు కావాలని వారు కోరారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
గోదావరిఖనిటౌన్: స్థానిక విఠల్‌నగర్ ఫీడర్ ప రిధిలో చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపడుతున్నందున బుధవారం విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగుతుందని ఏఈ నారాయణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫైవింక్లయిన్, భగత్‌సింగ్‌నగర్, సెవెన్‌బీకాలనీ, సిక్ హాస్పిటర్, తిలక్‌నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని వివరించారు.
వార్షిక లాభాలు ప్రకటించాలి
గోదావరిఖని: సింగరేణి సాధించిన లాభాలను ప్రకటించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.విశ్వనాథ్ డిమాండ్ చేశారు. మంగళవారం తిలక్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు ఖాసిం, ముత్తన్న, ఎల్లయ్య, రాజలింగం, మల్లేశ్ పాల్గొన్నారు.

కలెక్టర్‌ను నేరుగా కలవొచ్చు