
ఇళ్ల సర్వే పూర్తిచేయండి
రామగిరి(మంథని): రత్నాపూర్‌లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తిచేయా లని జెడ్పీ సీఈవో నరేందర్ ఆదేశించారు. స్థా నిక మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ఆ యన సోమవారం తనిఖీ చేశారు. ఇళ్లసర్వేతోపాటు ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో ఉమేశ్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ కవిత పాల్గొన్నారు.
స్థానిక యువతకు ప్లేస్‌మెంట్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల యువ తకు శిక్షణ కమ్ ప్లేస్‌మెంట్ అవకాశం కల్పిస్తున్నామని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీఐపీఈటీ) ప్రతినిధి ధర్మరా జు తెలిపారు. రామగుండంలోని ఎన్టీపీసీ తె లంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంతను సోమవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. మెషీన్ ఆపరేటర్ ప్లాస్టిక్ మోల్డింగ్ ప్రొఫెషనల్ అర్హత కలిగిన స్థానిక అ భ్యర్థులకు వందశాతం ప్లేస్‌మెంట్ కల్పిస్తామ ని హామీ ఇచ్చారు. ఆసక్తి గలవారు ధర్మరాజు ను 94412 47207 నంబరులో సంప్రదించండి .
భద్రత చర్యలు చేపట్టాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రాత్రనక, పగలన క పొలం పనులకు వెళ్లే రైతులు విద్యుత్ వినియోగం సందర్భంగా భద్రత చర్యలు పాటించి సురక్షితంగా ఉండాలని ట్రాన్స్‌కో డీఈ సూ చించారు. కూనారం సోమవారం చేపట్టిన పొ లంబాటలో ఆయన విద్యుత్ భద్రతపై రైతు లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ మో టార్ల వద్ద స్టార్టర్ల కోసం ఇనుపవాటికి బదులు ప్లాస్టిక్ డబ్బాలే అమర్చుకోవాలని సూచించారు. ఏడీఈ మధుకర్, ఏఈ శ్రీనివాస్, లైన్ ఇన్‌స్పెక్టర్ దస్తగిరి, రైతులు పాల్గొన్నారు.
హక్కులు కల్పించాలి
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): సింగరేణి లోని కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధత హక్కు లు, కనీస సౌకర్యాలు కల్పించాలని ఐఎఫ్‌టీ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ డిమాండ్ చే శారు. ఆర్జీ–2 ఏరియా పరిధి యైటింక్లయిన్‌కా లనీ, పోతనకాలనీ జోన్‌లో పనిచేస్తున్న కార్మికులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాన పనికి సమా న వేతనం చెల్లించకుండా కాంట్రాక్ట్ కార్మికుల ను శ్రమదొపిడీకి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయకులు రాజేశం, సులోచన, సుగుణ, మల్లేశ్, శంకర్, నగేశ్, ఎల్లక్క, పద్మ, కమల తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కరాటే పోటీల్లో సత్తా
గోదావరిఖనిటౌ న్: ఇటీవల మే డ్చల్‌లో నిర్వహించిన నేషనల్ ఓపెన్ టు ఆల్ క రాటే చాంపియన్‌షిప్ పోటీల్లో స్థానిక ఒకినోవా రెడ్ డ్రాగన్ కరా టే ఇన్‌స్టిట్యూట్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఇందులో జి.శాన్వి, ఎస్.సృరాష, ఆర్.రాజా, ఎస్‌కే అభన్, ఇ.వర్షిత్, టి.రిషిత, మహా లక్ష్మి, కె.క్రాంతి, ఎం.అమృత్‌సాయి వివిధ విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. జాతీయ గ్రాండ్ చాంపియన్‌గా జి.సాన్వి నిలిచింది. వీరిని ఇన్‌స్ట్రక్టర్ మొండయ్య తదితరులు అభినందించారు.
బీజేపీదే బాధ్యత
గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కు 42శాతం రిజర్వేషన్లు అమలు కాకుంటే ఆ పాపం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వీ రయ్య హెచ్చరించారు. స్థానిక సీఐటీయూ కా ర్యాలయంలో సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పంపించిన రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదించాలన్నారు. వై.యాకయ్య, ముత్యంరావు, మహేశ్వరి, కుమారస్వామి, రామాచారి, బిక్షపతి, గణేశ్, శ్రీనివాస్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల సర్వే పూర్తిచేయండి

ఇళ్ల సర్వే పూర్తిచేయండి

ఇళ్ల సర్వే పూర్తిచేయండి

ఇళ్ల సర్వే పూర్తిచేయండి