
మీ సేవకుడిని.. మీ సంక్షేమమే ధ్యేయం
పెద్దపల్లిరూరల్: తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మీ అందరి సంక్షేమమే తన ధ్యేయంగా రోజూ 18 గంటల పాటు పనిచేస్తూ సేవకుడిగా ఉంటున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గౌరెడ్డిపేట, ముత్తారంలో సోమ వారం రూ.90 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన లో రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాడేలేదన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక అర్హులందరికీ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకే అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌తోపాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, నాయకులు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లయ్య, రాజేందర్, మస్రత్, మహేందర్, ఎడెల్లి శంకర్, నరేశ్, కొ మ్ము శ్రీనివాస్, మల్లేశ్, మోహన్, నల్లగొండ కు మార్, రమేశ్, ఎద్దుకుమార్, శరత్ పాల్గొన్నారు.
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లిచ్చాం
వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే అండగా ఉండాలి
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు