
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతుల కు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఉ ద్యోగులు పనిచేయాలని టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ విద్యుత్ భవన్‌లోని ఎస్‌ఈ చాంబర్‌లో మంగళవా రం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వి ద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా భద్రత పరికరాలు వాడాలన్నారు. లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒకవేళ కాలిపోతే వెంటనే ఎస్పీఎం సెంటర్‌కు పంపించి రిపేర్లు చేయించాలని సూ చించారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడంతో పాటు చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. బకా యిలు వసూలు చేస్తూ రెవెన్యూ పెంచాలన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈలు తిరుపతి, లక్ష్మారెడ్డి, చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్‌ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి