
ముగిసిన బ్రహ్మోత్సవాలు
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): చిన్నకల్వలలో ని శ్రీమహమ్మాయిదేవీ బ్రహ్మోత్సవాలు శనివా రం వైభవంగా ముగిశాయి. ఈనెల 8న వేడుకలు ప్రారంభమయ్యాయి. చివరిరోజు మహాపూర్ణాహుతి హోమం, శ్రీహనుమాన్ జయంతి, మహాపడి నైవేద్య నివేదన, పల్లకీసేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని నిర్వాహకుడు కృష్ణమాచార్యులు తదితరులు తెలిపారు.
కార్పొరేట్లకే కేంద్రం మద్దతు
రామగుండం: ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న కేంద్రప్రభుత్వం.. మతతత్వం, దేశభక్తి పేరిట విభజించి పాలిస్తోందని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు కె.రమ వి మర్శించారు. అంతర్గాం మండల కేంద్రంలో శ నివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి పాలన సాగించడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్య క్తం చేశారు. నాయకులు జూపాక శ్రీనివాస్, కే జీ రామచందర్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి, ఆడెపు శంకర్, గుమ్మడి వెంకన్న, గొల్లపల్లి చంద్రయ్య, మార్త రాములు, పెండ్యాల రమేశ్, కో డిపుంజుల లక్ష్మి, కట్ట తేజేశ్వర్, తీగుట్ల రాము లు, కుమార్, మార్త రాధ, కొట్టె స్వరూప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పోటీలకు ఎంపిక
ధర్మారం(ధర్మపురి): స్థానిక ఆదర్శ(మోడల్ స్కూల్) విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బైకని శరణ్య ఫుట్‌బాల్ అండర్ –19 జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్‌కుమార్ తెలిపా రు. మహబూబ్‌నగర్‌లో గతేడాది నవంబర్ 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిందన్నారు. ఈనెల 15 నుంచి 21వరకు మణిపూర్‌లోని ఇంపాల్లో జరిగే పోటీ ల్లో మనరాష్ట్ర జట్టు తరఫున శరణ్య హాజరవుతుందన్నారు. శరణ్యను ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, పీఈటీలు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు అభినందించారు.
వక్ఫ్‌బోర్డు బిల్లు రద్దు చేయాలి
పెద్దపల్లిరూరల్: ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్‌బోర్డు బిల్లును రద్దు చేయాలని ముస్లిం, ఇస్లామిక్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుతో ము స్లింలు తమ ఆస్తులపై హక్కులు కోల్పోయే ప రిస్థితి వచ్చిందన్నారు. నాయకులు ముఫ్తి సాధిక్, మొహియుద్దిన్, ఫహీం, ఫయాజ్ అహ్మద్‌రష్డీ, షేక్ రుకునుద్దిన్, ముఫ్తి మజహర్ ఖాస్మీ, ఉస్మాన్ ఫక్రుద్దిన్, ముప్తి సయ్యద్ నవీద్, సైఫ్ హుస్సామీ, అతీఖుర్‌రెహమాన్, తాండ్ర సదానందం తదితరులు పాల్గొన్నారు.
వంటశాలకు శంకుస్థాపన
సుల్తానాబాద్(పెద్దపల్లి): నీరుకుల్ల రోడ్డులోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయ పరిసరాల్లో వంటశాల నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శనిగరపు శంకరయ్య, దాతలు అల్లం సత్యనారాయణ–భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ పాల్గొన్నారు.

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు