
కాషాయ‘కొండ’
● భక్తజన సంద్రమైన కొండగట్టు ● వైభవంగా అంజన్న చిన్నజయంతి వేడుకలు ● జైశ్రీరాం.. జైహనుమాన్ నామస్మరణలతో మార్మోగిన ‘కొండ’ ● భారీగా తరలివచ్చిన దీక్షాపరులు.. భక్తులు ● పర్యవేక్షించిన కలెక్టర్ సత్యప్రసాద్, ఈవో, అధికారులు
జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. జై శ్రీరా మ్, జై హనుమాన్ నామస్మరణతో అంజన్న సన్నిధి మార్మోగింది. ఆలయంలో హనుమా న్ చిన్నజయంతి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచి దీక్షాపరులు వేలాదిగా తరలివస్తున్నారు. సాయంత్రం వరకు సుమారు 30 వేల మంది మాల విరమణ చేయగా.. అర్ధరా త్రి వరకు సంఖ్య భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబా ద్, ఇతర జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు. అర్ధరాత్రి తర్వాత లక్షన్నరకు పైగా భక్తుల రాకతో కొండ కిక్కిరిసిపోయింది. కోనేటిలో స్నానమాచరించిన భక్తులు, క్యూలైన్ ద్వారా వెళ్లి ఇరుముడి సమర్పించి, మాల విరమణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోరెండు రోజుల పాటు జరుగనున్న జయంతి ఉత్సవాలకు రద్దీ కొనసాగనుంది. జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. మెడికల్‌క్యాంప్‌లో మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండాలన్నారు. కోనేరును తరచూ శుభ్రం చేయాలన్నా రు. ఆయన వెంట డీఎస్పీ రఘుచందర్, పంచాయతీ అధికారి మదన్‌మోహన్ తదితరులు ఉన్నారు.

కాషాయ‘కొండ’

కాషాయ‘కొండ’

కాషాయ‘కొండ’

కాషాయ‘కొండ’