విగ్రహావిష్కరణకు ఆహ్వానం
గోదావరిఖని: నగరంలో ఈనెల 11న ని ర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కణ కార్యక్రమానికి రావాలని కోరుతూ బీసీ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యకు విన్నవించారు. ఈమేరకు బీసీ లైజన్ అధికారి పెరుమాళ్ల శ్రీనివాస్, కై లాసకోటి శ్రీనివాస్, గజేందర్ ఆదివారం హైదరాబాద్‌లో కృష్ణయ్యను కలిశారు. కార్యక్రమానికి హాజరు కా వాలని ఆహ్వానపత్రిక అందజేశారు. ఇందుకు ఆయన అంగీకరించినట్లు వారు పేర్కొన్నారు.
హామీల అమలుకు పోరాటం చేస్తాం
సుల్తానాబాద్(పెద్దపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్ తో పోరాటం చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ని పలు ప్రాంతాల్లో ఆదివారం బీజేపీ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. హెచ్‌సీ యూ భూములను అమ్ముకోవాలని చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం చెంప పెట్టులాంటిదన్నారు. యాసంగి పంట లు ఎండిపోకుండా ఎస్సారెస్పీ ద్వారా మరో తడి అందివ్వాలని కోరారు. నాయకులు కడారి అశోక్‌రావు, సౌదరి మహేందర్ యాదవ్, కొ మ్ము తిరుపతి యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్, లంక శంకర్, కోట నాగేశ్వర్, వనజ, భాగ్యలక్ష్మి, నాగుల మల్యాల తిరుపతి, ఉషణ అన్వేశ్, కా మని రాజేంద్రప్రసాద్, బుర్ర సతీశ్, గుంటి కు మార్, చిట్టవేని సదయ్య, గజభింకర్ పవన్, పల్లె తిరుపతి, కందునూరి కుమార్, ఎనగందుల సతీశ్, వెంకటేశ్, సాయికిరణ్ ఉన్నారు.
అతిపెద్ద రాజకీయశక్తి బీజేపీ
గోదావరిఖని: బీజేపీ ప్రస్తుతం అతిపెద్ద రాజకీ య శక్తిగా ఎదిగిందని ఆ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో ఆదివారం సంధ్యారాణి పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. దేశ హితం కోసం పనిచేస్తూ భరత్‌ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. నాయకులు మేర్గు హన్మంత్‌గౌడ్, బల్మూరి అమరేందర్‌రావు, కోడూరి రమేశ్, కోమళ్ల మహేశ్, గుండబోయిన భూమయ్య, పిడుగు కృష్ణ, గోగుల రవీందర్‌రెడ్డి, జక్కుల నరహరి, పెండం సత్యనారాయణ, తడగొండ నర్సన్న, కుర్ర రాజేందర్, మచ్చ విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహావిష్కరణకు ఆహ్వానం
విగ్రహావిష్కరణకు ఆహ్వానం


