
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ
పెద్దపల్లిరూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని, అందుకు అనుగుణంగా స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ అరు ణశ్రీ అన్నారు. స్థానిక మున్సిపల్ ఆవరణలో ప్రభు త్వ పాఠశాలల విద్యార్థుల కోసం యూనిఫాం కు డుతున్న మహిళాశక్తి సెంటర్‌ను డీఆర్డీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్‌తో కలిసి శనివారం సందర్శించారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్స్‌ను సకాలంలో తయారు చేసి అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
మంథని జేఎన్టీయూలో ఆదివారం చేపట్టే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్– పీజీ ప్రవేశపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ అ రుణశ్రీ ఆదేశించారు. పరీక్షల విభాగం సూపరింటెండెంట్ బండి ప్రకాశ్, అధికారులతో ఆమె తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అ నుమతించాలన్నారు. చెప్పులు మాత్రమే ధరించాలని, షూకు అనుమతి లేదని పేర్కొన్నారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకు రావొద్దని సూచించారు.
ఉపాధి పనులపై శ్రద్ధ చూపాలి
జిల్లాలో ఉపాధిహామీ కింద పనులు గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించడంపై శ్రద్ధ చూపాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ సూచించారు. స్థానిక ఎంపీడీవో సమావేశమందిరంలో జిల్లాలోని ఏపీడీ, ఏపీవో, టీఏ, ఎఫ్‌లతో సమావేశమై పలు సూచనలు చేశారు. వర్షాలు కురిసే నాటికల్లా హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు సిద్ధ చేసుకోవాలన్నారు. వ్యవసాయాధారిత పనులను సైతం గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో చేపట్టాలని సూచించారు.
సవరించిన పాఠ్య ప్రణాళికతో ప్రయోజనం
జ్యోతినగర్(రామగుండం): సవరించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పిల్లల అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ సూచించార. స్థానిక మిలీనియం హాల్‌లో సవరించిన పాఠ్య ప్రణాళికపై అంగర్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు తమ నైపుణ్యాలు పెంపొందించుకొని పిల్లల నమోదును పెంచాలన్నారు. తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చేలా పిల్లలను ఆట, పాటలతో ఆకర్షించాలని సూచించారు. భాషాభివృద్ధి, శారీరక అభివృద్ధి, పిల్లల సంపూర్ణ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సొంత భవనంలోని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో న్యూట్రి గార్డెన్ పెంపొందించి గర్భిణిలు, బాలింతలు, పిల్లల సంపూర్ణ ఆరోగ్య అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారి రవుఫ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.