పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు

- - Sakshi

కరీంనగర్‌/పెగడపల్లి: ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తమ అనుచరుల్లోని ముఖ్యులను రంగంలోకి దింపి ఓటర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా సామాజికవర్గాల వారీగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కుస్తీ పడుతున్నారు. కుల పెద్దలను రహస్యంగా సంప్రదిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఉన్న ఓట్లను సామాజికవర్గాల వారీగా గుర్తించి ఆకట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. పగలు ప్రచారం.. రాత్రి మంతనాలు సాగిస్తూ అభ్యర్థులతో పాటు వారి అనుచరులు పడరాని పాట్లు పడతున్నారు.

కూడికలు.. తీసివేతలు
అన్ని సామాజికవర్గాల మద్దతు లభిస్తే విజయం సునాయాసమన్న భావనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం ఓటర్లలో ఏఏ సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. గెలుపోటములు నిర్దారించే పోలింగ్‌ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. సామాజికవర్గాల వారీగా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ టీం తయారు చేసుకొని తీసివేతలు, కూడికలు మొదలుపెట్టారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు కలిగి ఉన్న సామాజికవర్గాన్ని గుర్తించి వారి మద్దతును తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ప్రతీ నియోజకవర్గంలో 40 నుంచి 45శాతం ఓటర్ల మద్దతును కూడగట్టుకుంటే విజయం తథ్యమనే భావన అభ్యర్థుల్లో నెలకొంది. ఇప్పటికే పలు రాజకీయపక్షాలకు అనుకూలంగా వ్యవహరించే ఓటర్లను మినహాయించి తటస్థంగా ఉన్న ఓటర్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.

కులపెద్దలతో మంతనాలు
ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఓటర్లను గుర్తించి ఆయా వర్గాలకు చెందిన పెద్దలతో అనుచరగణం సాయంతో మంతనాలు చేస్తున్నారు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లలో వారిని అప్యాయంగా పలుకరించి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారితో ప్రస్తావించి గెలిచిన వెంటనే తొలిప్రాధాన్యమిచ్చి పరిష్కరిస్తామని హమీలిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కొన్ని సామాజికవర్గాల అభ్యర్థులు గెలుపోటములను శాసిస్తున్నాయి. అలాంటి సామాజికవర్గాన్ని గ్రామాల వారీగా గుర్తించేందుకు అభ్యర్థులు పక్కా ప్రణాళిక రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తుది ఓటర్ల జాబితాలోని ఓటర్ల శాతానికి అనుగుణంగా సామాజికవర్గాలను ఆకర్షించేందుకు అభ్యర్థులు అంకెల గారడీతో కుస్తీ పడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తుతుండడంతో రాజకీయ రణరంగం రసవత్తరంగా మారుతోంది.

సమయం లేక అభ్యర్థుల అవస్థలు
అసలే మాఘి పొద్దు. పొద్దంతా తక్కువగా సమయం ఉంటుంది. రాత్రంతా చలి. అందులో ప్రచారానికి సమయం ఉండటం లేదు. సహజంగా ఎన్నికలప్పుడు తప్ప నాయకులు ఎప్పుడు గ్రామాలకు రాలేదంటారు. కానీ ఎన్నికల వేళ కూడా అభ్యర్థులు ఓట్లు అడిగేందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లి ఓట్లు అడిగే సమయం లేదు. దీంతో ప్రధాన గ్రామాలపై దృష్టి సారించిన నేతలు పగలు ప్రచారం చేస్తూ రాత్రి వేళ మంతనాలు చేస్తున్నారు.

కార్యకర్తలపైనే ఆధారం
ప్రచారానికి సమయం లేకపోవడం, పైగా గ్రామాలు ఎక్కువగా ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలపైనే ఆధారపడుతున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని అవసరమున్న గ్రామాలకు మాత్రమే వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుని చక్కదిద్దే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా వలసలు, చేరికలు తదితర వాటిపై నేతలు దృష్టి సారించారు. చివరి రోజుల్లో ర్యాలీ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా మండలాల్లో అత్యధిక ఓటర్లున్నా గ్రామాలకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచారం ఒక వంతుగా చూస్తే అభ్యర్థులకు సవాలుగా మారినట్లే.

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2023
Nov 20, 2023, 10:43 IST
నాగర్‌కర్నూల్‌/అలంపూర్‌/కొల్లాపూర్‌/కల్వకుర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీకి అధికారం ఇస్తే కరెంట్‌ కష్టాలు తప్పవని, సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకమవుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
20-11-2023
Nov 20, 2023, 09:45 IST
జహీరాబాద్‌: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్‌ హయాంలోనే ఎం.బాగారెడ్డి,...
20-11-2023
Nov 20, 2023, 09:14 IST
రాజకీయ పార్టీల్లో వలసల పరంపర కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి జిల్లాలో రాజకీయ పార్టీల్లో ఒక...
20-11-2023
Nov 20, 2023, 08:54 IST
హైదరాబాద్: తాజా ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం లేదు. అయినా అభ్యర్థులను మించి కష్టపడాల్సి వస్తోంది. ఇందుకు కారణం...
20-11-2023
Nov 20, 2023, 08:53 IST
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009, 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర...
20-11-2023
Nov 20, 2023, 05:31 IST
ధర్మపురి/పెగడపల్లి/కాటారం: కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని, బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఎమ్మెల్సీ కవిత ప్రజలను కోరారు....
20-11-2023
Nov 20, 2023, 05:21 IST
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే సీఎం కేసీఆర్‌ ఉండాలి..కేసీఆర్‌ ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌...
20-11-2023
Nov 20, 2023, 05:06 IST
సిద్దిపేటజోన్‌: పక్కనున్న కర్ణాటకలో ఐదు గ్యారంటీలను ప్రకటించిన రాహుల్, ప్రియాంకాగాంధీ పత్తా లేకుండాపోయారని, అక్కడ పరిస్థితి గందరగోళంగా మారిందని మంత్రి...
20-11-2023
Nov 20, 2023, 04:51 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/సాక్షి, నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ పాలన అంటే ఆకలి చావులు, ప్రజలను...
20-11-2023
Nov 20, 2023, 04:23 IST
నిర్మల్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ...
20-11-2023
Nov 20, 2023, 01:38 IST
పెగడపల్లి(ధర్మపురి): పొద్దంతా చేనులో కట్టం చేసి వచ్చిన మల్లన్న పక్క ఊర్లో ఉంటున్న తన సోపతి రాజన్నకు ఫోన్‌ చేసి...
19-11-2023
Nov 19, 2023, 17:57 IST
తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులంతా దారికి వచ్చారా? రెబల్స్‌గా బరిలో దిగినవారంతా ఉపసంహరించుకున్నారా? తిరుగుబాటు దారుల్లో ఇంకా ఎందరు పోటీలో ఉన్నారు?...
19-11-2023
Nov 19, 2023, 16:01 IST
ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు....
19-11-2023
Nov 19, 2023, 15:06 IST
ఎన్నికలు ఏవైనా ఒకరు ఓడితేనే మరొకరు గెలుస్తారు. రాష్ట్రం అంతటా ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీ పోరాడుతున్నారు. ఆ...
19-11-2023
Nov 19, 2023, 14:14 IST
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రధాన పార్టీలు.. 
19-11-2023
Nov 19, 2023, 13:20 IST
సాక్షి,పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు మరోవారం రోజుల్లో ముగియనుంది. అయినా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన...
19-11-2023
Nov 19, 2023, 12:55 IST
సాక్షి, కరీంనగర్‌/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం...
19-11-2023
Nov 19, 2023, 12:34 IST
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పాలమూరు వ్యాప్తంగా ‘హస్తంశ్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. తారుమారు రాజకీయాల పరంపర ప్రధాన పార్టీలన్నింటిలోనూ కొనసాగుతున్నప్పటికీ.....
19-11-2023
Nov 19, 2023, 12:10 IST
సాక్షి, కామారెడ్డి: దొంగ ఓట్లను నియంత్రించడానికి నాటి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ టీఎన్‌ శేషణ్‌ విశేషంగా కృషి చేశారు. ఆయన...
19-11-2023
Nov 19, 2023, 11:18 IST
సాక్షి, నిజామాబాద్‌: ఆరు హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు పన్నుతోందని, ఏరు దాటాక తెప్ప తగలేస్తుందని మంత్రి... 

Read also in:
Back to Top