ప్రస్తుత రాజకీయాల్లో పెరిగిన స్వార్థం | - | Sakshi
Sakshi News home page

ప్రస్తుత రాజకీయాల్లో పెరిగిన స్వార్థం

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

కొత్తవలస: ప్రస్తుత రాజకీయాల్లో స్వార్థం పెరిగిపోయిందని ఇందుకు ఇటీవల జరిగిన పరిణామాలే ఉదాహరణ అని మాజీ మంత్రి, శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి కర్రి పల్లవికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో కలిసి కొత్తవలస గ్రామంలో మంగళవారం ఆయన ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రైల్వేస్టేషన్‌ ఆర్చి నుంచి గ్రామంలో ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన కనకాల శివ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కనకాల శివ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన మేలాసీ్త్ర కనకరాజు, ఎర్ర సూరిబాబు, కోట్ని అశోక్‌ తదితరులకు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన కార్యకర్తలు, కొత్తవలస గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజకీయల్లో స్వార్థం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో పెద్దపీట

వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో కొత్తవలస మండలంలో పలువురు సకల భోగాలు అనుభవించి ఇప్పుడు పార్టీ ఫిరాయించారని వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామన్నారు. అలాగే ఇప్పడు పార్టీలో చేరినవారికి భవిష్యత్తులో పెద్దపీటవేస్తామని వారికి తగ్గ భోరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. కొత్తవలస మేజర్‌ పంచాయతీకి విద్యావేత్త, అతి పిన్నవయస్కురాలు కర్రి పల్లవి సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తోందని ఆమెను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఉన్నత చదువులు చదువుకున్నవారు పదవులు అలంకరిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాసరావు, శోభా హైమావతిలు మాట్లాడుతూ పల్లవి గెలుపుతోనే కొత్తవలస మేజర్‌ పంచాయతీని పునర్‌నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఆమె గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, పార్టీ నాయకులు, కనకాల శివ, కర్రి శ్రీనివాసరావు, బీఏ నాయుడు, చాముండేశ్వరి, మాధవరావు, వెంకన్నపాత్రుడు, రామన్నపాత్రుడు, పొలమరశెట్టి రామకృష్ణ, పలువురు వార్డు మెంబర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.

కొత్తవలస మండలమే ఉదాహరణ

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

రానున్నది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే

మాజీ మంత్రి సమక్షంలో పలువురికి పార్టీ తీర్థం

కొత్తవలస మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement