పూసపాటిరేగ: భోగాపురం జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ లారీలు ఆపకుండా, లారీల పార్కింగ్‌కు అనువుగా బే–పార్క్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. భోగాపురం మండలంలోని రావాడ వద్ద జాతీయ రహదారి సమీపంలోని బే–పార్క్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. విశ్రాంతి కోసం డ్రైవర్లు లారీలను రహదారిపై ఎక్కడపడితే అక్కడ నిలిపివేయడం వల్ల వాటిని ఇతర వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయే ప్రాంతాల్లో బే–పార్క్‌లు ఉన్నాయో తెలిసేలా రహదారిపై సూచీలు ఏర్పాటు చేస్తే లారీ డ్రైవర్లు వాటిని ఉపయోగించుకుంటారన్నారు. సంబంధిత అధికారులు హైవే అథారిటీ అధికారులను తీసుకుని పోలీస్ కార్యాలయానికి వస్తే బే–పార్క్‌ల ఏర్పాటు, వినియోగంపై చర్చించడం జరుగుతుందని డీఎస్పీ లక్ష్మణమూర్తి తెలిపారు.


